Site icon NTV Telugu

MEA: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..

Bangladesh Hindus

Bangladesh Hindus

MEA: బంగ్లాదేశ్‌లోని మతోన్మాద మూక హిందువుల్ని టార్గెట్ చేసి, చంపేస్తోంది. మైమన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దైవదూషణ ఆరోపణలతో మూకదాడికి పాల్పడి హతమార్చారు. అతడి శరీరాన్ని రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి, కాల్చి చంపారు. ఈ ఘటన భారతదేశంతో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీని తర్వాత, రాజ్‌బరి జిల్లాలో మరో హిందూ వ్యక్తి అమృత్ మండల్ అనే వ్యక్తిని చంపేశారు.

Read Also: Bangladesh Lynching: ‘‘గాజాపై కన్నీరు, హిందువు హత్యపై మౌనం ’’.. సెలబ్రిటీలను ప్రశ్నించిన జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్..

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తుల హత్యల్ని భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. పొరుగుదేశం దాడుల్ని మైనారిటీలపై ‘‘నిరంతర శత్రుత్వం’’గా అభివర్ణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల హత్యలతో న్యూఢిల్లీ కలవరపడిందని, బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని, MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. “బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయం. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక హిందూ యువకుడి హత్యను మేము ఖండిస్తున్నాము, నేరస్థులను శిక్ష పడాలని ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.

“మైమెన్‌సింగ్‌లో ఇటీవల ఒక హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని మేము ఖండిస్తున్నాము మరియు ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతారని ఆశిస్తున్నాము. తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హత్యలు, దహనకాండలు,భూకబ్జాలతో సహా మైనారిటీలపై 2,900కు పైగా హింసాత్మక సంఘటనలు జరిగినట్లు స్వతంత్ర వర్గాలు నమోదు చేశాయి. ఈ సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తులుగా లేదా రాజకీయ హింసగా కొట్టిపారేయలేము,” అని ఆయన చెప్పారు.

Exit mobile version