NTV Telugu Site icon

Archana Gautam: కాంగ్రెస్ కార్యాలయం బయట జరిగిన దాడి అత్యాచారం కంటే తక్కువేం కాదు

Archana

Archana

ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం బిగ్‌బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో  ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లానని ఆమె తెలిపారు. వారిని అభినందించడానికే అక్కడికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగినట్లు అర్చన పేర్కొన్నారు. అక్కడ వారిపై భౌతిక దాడి కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

Also Read: ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!

ఇక ఈ విషయం గురించి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన అర్చన అక్కడ ఉన్న వారు తమని లోపలి వెళ్లనివ్వకుండా గేట్లు మూసే ఉంచారన్నారు. తమని లోపలికి రానివ్వకుండా వారికి ఆదేశాలు ఉన్నాయని అక్కడి వారు పేర్కొన్నట్లు అర్చన తెలిపారు. అయితే అందుకు గల కారణాలు తెలియదు అని పేర్కొన్న బ్యూటీ,  బిగ్‌బాస్ ముగిసినప్పటి నుంచి కార్యాలయానికి వెళ్లలేదు కాబట్టి తనకి మంచి స్వాగతం లభిస్తుందని ఆశించినట్లు పేర్కొంది. తన డ్రైవర్ తలకు గాయం అయ్యిందని, ఈ ఘటనలో తన తండ్రి తలకు కూడా గాయం అయినట్లు పేర్కొంది.

అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపిన ముందుగుమ్మ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొంది. అయితే ఈ విషయాలు ప్రియాంకగాంధీకి, రాహుల్ గాంధీకి ఇంకా తెలియవని తాను అనుకుంటున్నట్లు తెలిపిన అర్చన వారి నుంచి ఫోన్ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రియాంక నుంచి ఫోన్ రాకపోతే తనకు ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా కాంగ్రెస్ కార్యాలయం ముందు దాడి జరగడం నడిరోడ్డుపై అత్యాచారం జరగడం కంటే తక్కువేం కాదన్నారు.