NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

Crime Chattisgar

Crime Chattisgar

ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్-బిలాయిగఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి గొడ్డలి, కత్తితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా చంపి, ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. ఈ దారుణ ఘటన సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది.

Read Also: Priyanka Gandhi: మహాత్ముడి చివరి మాట ‘హే రామ్’.. కాంగ్రెస్ ఎలా హిందూ వ్యతిరేకి అవుతుంది..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. స్థానికులు ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతుండగా.. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సారన్‌గఢ్‌ బిలాయిగఢ్‌ జిల్లా సూపరింటెండెంట్‌ పుష్కర్‌ శర్మ ఈ ఘటన గురించి సమాచారం అందించారు.

Read Also: Virat Kohli: ఆ సందర్భాల్లో హార్ట్ బ్రేక్ అయింది.. కోలుకోవడానికి సమయం పట్టింది

ఈ మారణకాండలో మరణించిన వారిని హేమ్‌లాల్, జగ్మతి, మీరా, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రాథమిక విచారణలో నిందితుడు పక్కనే ఉండే పప్పు టేలర్‌గా చెబుతున్నారు. అయితే.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై విచారణ చేసిన అనంతం మరింత సమాచారం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Show comments