Site icon NTV Telugu

Uttar Pradesh: యూపీలో దారుణం.. కూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన..!

Rape

Rape

తల్లి తర్వాత విలువైన సంబంధం కలిగి ఉండేది తండ్రికే. కూతురు-తండ్రి మధ్య బంధం అంటే ఎంతో బలంగా ఉంటుంది. కూతురికి తండ్రి అంటే గొప్ప నమ్మకం, ధైర్యం. అలాంటి తండ్రి తనానికే మచ్చ తీసుకొచ్చాడు ఓ కామాంధుడు. తండ్రే ఓ కూతురి పట్ల కామ మృగాడిలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించాడు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ ఎల్లప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నమస్కరించే వారు: ప్రణబ్ కూతురు శర్మిష్ట..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండేళ్లుగా కూతురితో తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఈ రెండేళ్లపాటు దారుణానికి ఒడికట్టిన ఘటన తల్లికి తెలియదు. ఆ తర్వాత తన తండ్రి చర్యలు భరించలేకపోవడంతో బాలిక ధైర్యం తెచ్చుకుని ఈ ఘటన గురించి తన తల్లికి చెప్పింది. దీంతో తల్లి తన భర్తపై కేసు పెట్టింది. దీంతో.. నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో రెండేళ్లుగా నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో వెల్లడైంది. తన కూతురికి 17 ఏళ్ల వయసున్నప్పుడి నుంచి ఈ పాడు పని చేస్తున్నాడు.

Read Also: China: ప్రపంచంలోని తొలిసారిగా ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్‌ని ప్రారంభించిన చైనా..

ఈ ఘటనపై.. బాధిత బాలిక తల్లి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version