NTV Telugu Site icon

Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు

Murder

Murder

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు. ఈ కేసులో నిందితుడికి, మహిళకు మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్ల క్రితం వీరి ప్రేమకు ప్రియురాలి భర్త అడ్డుగా మారడంతో ఇద్దరూ కలిసి అతని గొంతు నులిమి చంపేశారు. ఈ కేసులో రెండేళ్లుగా జైల్లోనే ఉన్న నిందితుడు.. బెయిల్ ద్వారా ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు.

Anurag Thakur: భారతీయ సంస్కృతి, సమాజాన్ని కించపరిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతించబోం

ప్రియురాలు నిరంతరం వేధింపులకు దిగేదని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. దీంతో ఏమీ అర్థంకాక హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కొంచ్ కొత్వాలిలోని గాంధీనగర్ బక్షేశ్వర దేవాలయం సమీపంలో పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు చెప్పారు. ఆ మహిళను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ మెడపై పదునైన ఆయుధం ఉన్న గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.

Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్

మరోవైపు హత్యకు గురైన మహిళ రోష్ని కుష్వాహకు మూలచరణ్ అలియాస్ ములుతో వివాహం జరిగింది. అంతకుముందే తన భర్తను హత్య చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. ములు హత్య కేసును కూడా కలిపే ప్రయత్నం చేశారు. 2021లో ముల చరణ్‌ను అతని భార్య రోష్ని తన ప్రేమికుడి కోసం హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితులిద్దరూ.. బెయిల్‌పై బయటకు వచ్చారు. జూలై 17న రోష్ని తన పిల్లలతో కలిసి కొంచ్‌ పట్టణానికి వచ్చినట్లు విచారణలో ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోను అక్కడకు చేరుకుని రోష్నిని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. రోష్ని రోజూ డబ్బులు డిమాండ్ చేసేదని పోలీసుల విచారణలో నిందితుడు సోను తెలిపాడు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే జైపూర్ వెళ్లిందని.. వేరొకరితో పరిచయం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో పేర్కొన్నాడు.