NTV Telugu Site icon

ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్‌ సర్క్యూట్‌ దెబ్బకి..

Atm Blast

Atm Blast

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఏటీఎంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఎనిమిది లక్షల నగదు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు ఏటీఎంను దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చోరీ సమయంలో ఏటీఎంలో నగదు బాక్స్ తెరవకపోవడంతో దొంగలు డబ్బుపై ఆశలు వదులుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.

Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..

అల్లా ఆ దొంగలు వెళ్లిన కొద్దిసేపటికే ఏటీఎం షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో.. అందులోని నగదు మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉదయం బ్యాంకు ఉద్యోగులు వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. దొంగల బాగోతం బయటపడింది. తనిఖీ చేయడంతో ఈ విషయం తెలిసింది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌ రెడ్డి వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత ఘటనపై బ్యాంకు అధికారులు ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ సహాయంతో అతి త్వరలో నిందితులను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.

Show comments