ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌పై దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి రోజురోజుకు ఏదో కొత్తదాన్ని డిస్కవర్ చేస్తున్నాము. అభిమానులు ఎంతగా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారో తనకైతే అంతకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ గా ఉంది. “మీకు అప్డేట్ ఇవ్వాలని నాకు చాలా ఉంది. తప్పకుండా మేము అభిమానులకు సర్ఫరైజ్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం. నన్ను నమ్మండి ఫ్యాన్స్ ఈ సినిమాను మాక్సిమమ్ ఎంజాయ్ చేస్తారు” అని అన్నాడు.
Also Read : PEDDI : రామ్ చరణ్ ‘పెద్ది’ దసరాకు పోస్ట్ పోన్.. కారణం ఏంటంటే?
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పాత్రపై ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చాడు అట్లీ. దీపిక గురించి మాట్లాడుతూ ‘దీపిక తనకు లక్కీ చార్మ్, తను ఉంటె నాకు ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. అందులో ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేస్తున్న తొలి సినిమా. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ఓ కొత్త దీపికను ఈ చిత్రంలో చూస్తారని’ అన్నాడు. అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌తో పాటు దీపికా పదుకొణె కాంబోలో తెరకెక్కుతున్నఈ సినిమా ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సన్ పిచర్స్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
