Site icon NTV Telugu

Atchannaidu: రాజకీయాల్లో ఇలాంటి పిరికిపందను ఇంత వరకు చూడలేదు

Atchenayudu

Atchenayudu

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టైయ్యాడు. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసి సీఎం జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు.. చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయింది.. ఆ భయంతోనే ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో జగన్ లాంటి పిరికిపందను ఇంతవరకు చూడలేదు..
కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులతో సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడతారా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Read Also: Pakistan Economy: దారుణంగా తయారైన పాకిస్తాన్ పరిస్థితి.. జనాభాలో 40శాతం మంది పేదలే

రాక్షసులకు రాక్షసత్వం నేర్పింది కూడా జగనే అనే విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు అంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డాడు. అసూయతో రగిలి పోయే జగన్ ఏమి చేయలేరు.. ఇప్పుడు అధికార బలంతో ర్యాలీని అడ్డుకోవచ్చు ఏమో కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం అడ్డుకోవడం జగన్ తాత వల్ల కూడా కాదు అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Read Also: IND vs AUS 2nd ODI: టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా.. జస్ప్రీత్ బుమ్రా దూరం!

ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితులను జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్షించారు. చంద్రబాబు రిమాండ్ గడువు సాయంత్రానికి ముగియడంతో పాటు ఐటీ ఉద్యోగులు కార్లతో ర్యాలీగా రావడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ జైలు రోడ్ లో డీఎస్పీ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు పరిస్తితిని సమీక్షిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version