NTV Telugu Site icon

Atchannaidu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. చరిత్రలో నిలిచిపోతుంది

Atchannaidu

Atchannaidu

ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ సాధించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉందో మహానాడుతో తేలిపోయిందని అచ్చె్న్నాయుడు పేర్కొన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు నిర్వహణకు స్థలం ఇచ్చి సహకరించిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలు సమీపంలో నిర్వహించిన మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు.

Minister Jayaram: మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తాం

మరోవైపు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బస్సులు ఆపించినా, టైర్లలో గాలి తీయించినా మహానాడు విజయవంతం కావడం శుభపరిణామం అన్నారు. మహానాడు వేదికగా టీడీపీ నేతల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఫ్రస్టేషన్‌లో మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె చురకలు అంటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై మంత్రి రోజా అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోజా మంత్రిగా కాకుండా నటిగానే మాట్లాడుతుండటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి రోజాకు వంగలపూడి అనిత సవాల్ విసిరారు.