NTV Telugu Site icon

Pushpa 2 : చివర్లో టెన్షన్ పెడుతున్న పుష్పరాజ్?

Pushpa (2)

Pushpa (2)

Pushpa 2 : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప 2 రిలీజ్‌కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడితో గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. మరి పుష్ప 2 షూటింగ్ పూర్తైందా? అంటే, చిత్ర యూనిట్ నుంచి గుమ్మడి కాయ కొట్టిన సమాచారం అధికారికంగా బయటికి రాలేదు. కానీ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావచ్చింది. గత వారం రోజులుగా అల్లు అర్జున్, శ్రీలీల పై ఐటెం సాంగ్ షూట్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పుడీ పాట షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడితో పుష్ప2 షూటింగ్ అయిపోయినట్టేనని అనుకున్నారు. ఏదైనా ప్యాచ్ వర్క్‌లు ఉంటే ఉండొచ్చనే మాట వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మరో పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read Also:IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్‌పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!

హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికపై డ్యూయెట్ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవనుందని సమాచారం. కానీ ఇన్ని రోజులు టైం తీసుకున్న సుకుమార్.. రిలీజ్ టైం దగ్గరి పడే వరకు షూటింగ్ పూర్తి చేయకపోవడమే.. ఫ్యాన్స్‌ని కాస్త టెన్షన్ పడేలా చేస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌కి బదులుగా తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్‌ను తీసుకున్నారనే టాక్ ఉంది. పుష్ప పార్ట్ 1 విషయంలో ఆర్ఆర్‌తో పాటు.. సీజీ వర్క్‌ సరిగ్గా లేదనే కామెంట్స్ వినిపించాయి. కాబట్టి.. ఫైనల్ స్టేజ్‌లో చిత్ర యూనిట్ పరిగెత్తాల్సిందే. ఇప్పటికే రెండు మూడు యూనిట్లతో సుకుమార్ చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఫస్టాఫ్ లాక్ చేసి పెట్టుకున్నాడు సుక్కు. కాబట్టి.. పుష్ప 2 పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. డిసెంబర్ 5న పుష్పగాడి రూలింగ్ మొదలవడం.. బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ.

Read Also:Minister Rama Naidu: చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు

Show comments