Pushpa 2 : చివర్లో టెన్షన్ పెడుతున్న పుష్పరాజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప 2 రిలీజ్‌కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడితో గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. మరి పుష్ప 2 షూటింగ్ పూర్తైందా? అంటే, చిత్ర యూనిట్ నుంచి గుమ్మడి కాయ కొట్టిన సమాచారం అధికారికంగా బయటికి రాలేదు. కానీ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావచ్చింది. గత వారం రోజులుగా అల్లు అర్జున్, శ్రీలీల పై ఐటెం సాంగ్ షూట్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పుడీ పాట షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడితో పుష్ప2 షూటింగ్ అయిపోయినట్టేనని అనుకున్నారు. ఏదైనా ప్యాచ్ వర్క్‌లు ఉంటే ఉండొచ్చనే మాట వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మరో పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also:IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్‌పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!
Also Read
హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికపై డ్యూయెట్ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవనుందని సమాచారం. కానీ ఇన్ని రోజులు టైం తీసుకున్న సుకుమార్.. రిలీజ్ టైం దగ్గరి పడే వరకు షూటింగ్ పూర్తి చేయకపోవడమే.. ఫ్యాన్స్‌ని కాస్త టెన్షన్ పడేలా చేస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌కి బదులుగా తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్‌ను తీసుకున్నారనే టాక్ ఉంది. పుష్ప పార్ట్ 1 విషయంలో ఆర్ఆర్తో పాటు.. సీజీ వర్క్ సరిగ్గా లేదనే కామెంట్స్ వినిపించాయి. కాబట్టి.. ఫైనల్ స్టేజ్‌లో చిత్ర యూనిట్ పరిగెత్తాల్సిందే. ఇప్పటికే రెండు మూడు యూనిట్లతో సుకుమార్ చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఫస్టాఫ్ లాక్ చేసి పెట్టుకున్నాడు సుక్కు. కాబట్టి.. పుష్ప 2 పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. డిసెంబర్ 5న పుష్పగాడి రూలింగ్ మొదలవడం.. బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ.
Read Also:Minister Rama Naidu: చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు
- Tags
- Allu Arjun
- pushpa 2
- Rashmika
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!