Site icon NTV Telugu

Terrorist Attack : పాకిస్తాన్ లో ఘోరం.. ఉపాధ్యాయులపై ముష్కరుల కాల్పులు..8మంది మృతి

New Project (13)

New Project (13)

Terrorist Attack : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ప‌రీక్షల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న టీచర్లపై టెర్రరిస్టులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పర్ కుర్రం గిరిజన జిల్లాలోని తేరీ మెంగల్ హైస్కూల్ పై టెర్రరిస్టులు దాడి చేసి పరీక్ష విధుల్లో ఉన్న ఏడుగురు ఉపాధ్యాయులను హతమార్చారు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతం నుంచి ముష్కరులు పారిపోయారు. దీనికి తామే బాధ్యులమని ఏ గ్రూపు ఇప్పటి వరకు ప్రకటించుకోలేదని అధికారులు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఇంకో వ్యక్తి చనిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ లోని వాయువ్య గిరిజన జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని అప్పర్ కుర్రం గిరిజన జిల్లా పరచినార్ ప్రధాన కార్యాలయంలోని షాలోజాన్ రోడ్డులో తేరీ మెంగల్ తెగకు చెందిన మహ్మద్ షరీఫ్ అనే పాఠశాల ఉపాధ్యాయుడి కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:Andhrapradesh: జగన్‌ సర్కార్ గుడ్‌న్యూస్.. నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ

అలాగే, అదే జిల్లాలోని ప్రభుత్వ తేరీ మెంగల్ హైస్కూల్ స్టాఫ్ రూమ్ లోకి చొరబడి టోరీ తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను ముష్కరులు హతమార్చారు. ఉపాధ్యాయులందరూ తమ పరీక్ష విధులు నిర్వర్తించడానికి పాఠశాలలో ఉన్నారు. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ దాడులకు ఏ గ్రూపు లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు, కానీ ఈ ప్రాంతం సున్నీలు- షియాల మధ్య మతపరమైన ఘర్షణలకు కేంద్రంగా ఉంది. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హత్యల అనంతరం 9, 10 తరగతుల కోహత్ బోర్డు పరీక్షను కూడా వాయిదా వేశారు. ఏడుగురు ఉపాధ్యాయుల హత్య కేసులో నిందితులను అరెస్టు చేసే వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆల్ ఖుర్రం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జాహిద్ హుస్సేన్ తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also:Vaishakh Purnima: జూదం, మద్యం అలవాట్ల విముక్తికి ఈ స్తోత్రం వినండి

Exit mobile version