Site icon NTV Telugu

Floods: ఇండోనేషియాలో వరదలు.. 14 మంది మృతి

Flods

Flods

ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. సులవేసి ద్వీపంలో వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మరణించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. సులవేసిలోని వాజోలో వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని స్థానిక రెస్క్యూ చీఫ్ మెక్సియానస్ బెకాబెల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Kakarla Suresh: తండ్రి కోసం కొడుకు, కూతురు ఎన్నికల ప్రచారం..!

భారీ వరదలు 13 జిల్లాలపై ప్రభావితం చూపాయి. అంతేకాకుండా మొత్తం ప్రాంతాలన్నీ బురదతో నిండిపోయాయి. వెయ్యికు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయ బృందం.. ప్రజలను ఇళ్లలోంచి ఖాళీ చేయిస్తున్నారు. మసీదులు, బంధువుల ఇళ్లకు బాధితులను తరలిస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి శనివారం తెలిపారు.

ఇది కూడా చదవండి: Loksabha Elections : సూరత్, ఇండోర్, ఇప్పుడు పూరీ.. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన కాంగ్రెస్ అభ్యర్థి

వర్షాల కారణంగా ఇండోనేషియాలో తరచుగా కొండచరియలు విరుగుపడుతుంటాయి. అలాగే వరదలు సంభవిస్తుంటాయి. ఈ దీవుల్లో మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని తానా తోరాజా జిల్లాలో ఏప్రిల్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు.

ఇది కూడా చదవండి: Viral : గర్ల్‌ఫ్రెండ్‌కి నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌ని బహుమతిగా ఇచ్చాడు.. కానీ..!

Exit mobile version