Site icon NTV Telugu

Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి

Boat

Boat

Boat capsize : పాకిస్తాన్ లో విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. బోటు బోల్తాపడి పదిమంది స్టూడెంట్స్ మరణించారు. స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన తండా దామ్ లేక్‌లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత పడవ తిరగబడింది. దీంతో విద్యార్థులంతా నీళ్లలో మునిగిపోయారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. 11 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

Read Also: Verity Pooja: వీసీ మససు మార్చు తల్లీ.. అంటూ అమ్మవారికి స్టూడెంట్స్ పూజలు

పాకిస్తాన్‌లో ఆదివారం ఒక బస్సు లోయలో పడి 40 మందికిపైగా మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మరణించిన స్టూడెంట్స్ అంతా 7-14 ఏళ్ల లోపు వయసు వాళ్లే. పాకిస్తాన్‌లో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అక్కడి వాళ్లలో ఎక్కువ మందికి ఈత రాకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం. బోటు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also:Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన

Exit mobile version