Site icon NTV Telugu

Aswani Dutt – Chandra Bose : వారందరిని మళ్లీ గుర్తు చేశావయ్యా చంద్రబోస్.. అశ్వినిదత్ ట్వీట్..

Kalki

Kalki

Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేస్తూ.. మరోవైపు సినిమాకు సంబంధించిన పాటలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ మంచి బజ్ ను తీసుకొస్తున్నారు సినిమా మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుండి థీమ్ ఆఫ్ కల్కిను సినీ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. నిజంగా ఈ పాటలో ఆయన చేకూర్చిన పదాలు పాటకే అందాన్ని తీసుకువచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు పాటపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Thandel : దుళ్లకొట్టేయాలి అంతే.. అక్కినేని నాగచైతన్య..

ఈ పాటకు సంబంధించి తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ట్విట్టర్ వేదికన చంద్రబోస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. తనకు మళ్లీ మా ఆత్రేయ గారిని, వేటూరి గారిని, సిరివెన్నెల గారిని గుర్తు చేశావయ్యా చంద్రబోస్ అంటూ.. కల్కి థీమ్ సాంగ్ ను జతచేశారు. దీనికి ” థాంక్యూ ఫర్ దిస్ గ్రేట్ గిఫ్ట్ ” అంటూ పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించారు. సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లతోపాటు మరికొందరు తారాగణం కీలకపాత్రలలో సినిమాలో నటించారు.

Buddy Movie : “బడ్డీ” రీమేక్ కానేకాదు.. అల్లు శిరీష్..

Exit mobile version