Site icon NTV Telugu

AstraZeneca: ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

Astrazeneca

Astrazeneca

AstraZeneca: తాము తయారు చేసిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. వాణిజ్యపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ టీకా తయారీ, సరఫరా నిలిపివేశామని, మార్కెటింగ్ అనుమతులు కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా కంపెనీ చెప్పిందని అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా విదేశాల్లో వాక్స్‌జెర్వియా, భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో విక్రయించారు.

Read Also: M. K. Stalin:తమిళనాడుపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ట్రాన్స్ జెండర్, దళిత విద్యార్థికి సీఎం సత్కారం

కాగా, వాక్స్‌జెర్వియాతో రక్తం గడ్డకట్టి బాధితులు మరణించిన ఘటనలు బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చాయని బాధితులు న్యాయ పోరాటం చేశాయి. టీకా కారణంగా యూకేలో 81 మంది మరణించగా.. తీవ్ర ఆనారోగ్యాలు తలెత్తినట్టు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తమ టీకాతో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్టు ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టులో వెల్లడించింది. ఐరోపా దేశాల్లో టీకాను వెనక్కు తీసుకునేందుకు మార్చి 5వ తేదీన సంస్థ దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం నాటి నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది ఆస్ట్రాజెనెకా పేర్కొనింది. బ్రిటన్ సహా, ఇతర దేశాల్లోనూ త్వరలో టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ దాఖలు చేసుకుంది.

Read Also: Allu Arjun : ఇంజిన్ లేని బోగిలా వెళ్తున్న నన్ను ఆయన సరైన దారిలో పెట్టారు..

ఇక, కరోనాను తుదముట్టించడంలో మా టీకా పాత్రను చూసి గర్వపడుతున్నాం అని ఆస్ట్రోజెనెకా తెలిపింది. సంక్షోభం తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో ఏకంగా 65 లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు పేర్కొనింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 100 కోట్ల టీకాలను సరఫరా చేసినట్లు చెప్పుకొచ్చింది. కరోనా సంక్షోభ నివారణలో మా శ్రమను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తించాయని ఆస్ట్రాజెనెకా మీడియాతో చెప్పుకొచ్చింది.

Exit mobile version