NTV Telugu Site icon

Assam Police: భారత్లోకి ప్రవేశించేందుకు నలుగురు బంగ్లాదేశీయులు యత్నం..

Assam Police

Assam Police

ఆదివారం అర్థరాత్రి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. వారిని మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా.. రీటా ముల్లాగా గుర్తించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ‘X’ లో తెలిపారు. “ఈ రోజు తెల్లవారుజామున 1:30 గంటలకు బంగ్లాదేశ్ పౌరులు మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా మరియు రీటా ముల్లా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే.. జీరో పాయింట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. తక్షణమే వారిని తిరిగి పంపించారు” అని సీఎం ‘X’ లో పోస్ట్‌ చేశాడు.

Botsa Satyanaryana: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు ఈశాన్య ప్రాంతాలకు ఆందోళన కలిగించే విషయమని.. అక్కడి ప్రజలు సరిహద్దు గుండా ప్రవేశించే అవకాశం ఉందని.. పొరుగు దేశం వారికి ఈ ప్రాంతం నుండి తిరుగుబాటుదారుల కేంద్రంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తున్నదని.. అందుకే సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని ముఖ్యమంత్రి బిశ్వశర్మ తెలిపారు, ప్రస్తుతానికి.. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా.. భారత పౌరులు తప్ప ఎవరూ బంగ్లాదేశ్ నుండి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించేదిలేదని ఆయన పేర్కొన్నారు.

Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం

మరోవైపు.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా ఉండేలా హై అలర్ట్ జారీ చేసినట్లు అస్సాం పోలీస్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ తెలిపారు. సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్, అస్సాం పోలీసులు నిఘా కాస్తున్నారని చెప్పారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్, త్రిపుర.. మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 11 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) ఆదివారం తెలిపింది. కాగా.. బంగ్లాదేశ్ లో పరిస్థితుల దృష్ట్యా చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. కాగా.. వారిని భద్రతా దళాలు అడ్డుకుంటున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో అనేక పాయింట్ల వద్ద బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) సహాయంతో గత కొన్ని రోజులుగా వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలను వెనక్కి పంపించారు.

Show comments