Frogs Wedding: ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. ఇక, వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. తాజాగా అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఆదర్శ గోరెహగి గ్రామంలోని స్థానికులు వరుణ దేవుడి కటాక్షాన్ని పొందడానికి పురాతన మార్గాలను ఆశ్రయించారు. డప్పు చప్పుళ్లతో జోరుగా కప్పల పెళ్లి చేసి వానలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. ‘భేకులి బియా’ అని కూడా పిలువబడే ఈ వేడుకలో గ్రామస్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి కరువు పీడిత భూములకు ఉపశమనం కలిగించాలని ప్రార్థించారు. కరువుతో సతమతమవుతున్న రైతులు చాలా కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Barsana Temple: ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి.. రైలింగ్ కూలి 22 మందికి గాయాలు
కప్పల పెళ్లి అనేది కరువు లాంటి పరిస్థితి నుండి ఉపశమనం పొందడానికి వర్షపు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సాంప్రదాయ ఆచారాలతో అడవి కప్పలను వివాహం చేసుకునే పురాతన వేడుక. అక్కడ ఉన్న ప్రజలు ఈ ఆచారం ఖచ్చితంగా పనిచేస్తుందని, ఈ పరిస్థితి నుంచి తమకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. “చెరువులలో నీరు లేదు. పశువులు, మేకలకు ఆహారం లేదు. కరువు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గోరేహగి గ్రామంలోని 700 కుటుంబాలు కప్పల పెళ్లిని నిర్వహించాయి,” అని స్థానిక మహిళ చెప్పారు. “గత చాలా రోజులుగా వర్షాలు లేవు, వర్షాలు కురియకపోవడంతో చాలా చెట్లు చనిపోతున్నాయి, వరి పొలాలు ఎండిపోయాయి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి, గొరహగి గ్రామ ప్రజలు కప్ప నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. విమా పూర్వీకులు సూచించినట్లు మేము సరైన ఆచారాలతో కప్పల వివాహం చేయాలని నిర్ణయించుకున్నాము. గ్రామస్తులందరూ పాల్గొన్నారు. ”అని స్థానిక యువకుడు చెప్పారు.