Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్‌తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్‌లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.
READ MORE: Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
Also Read
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
ముఖ్యమంత్రి హిమంత్ తన పిల్లల గురించి కూడా ప్రస్తావించారని, అది చాలా దిగజారిన చర్య అని గోగోయ్ విమర్శించారు. మాకు సీఎం కుటుంబం గురించి తెలుసు. కానీ మేము అలాంటి విషయాలు బయట పెట్టమన్నారు. తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను విడుదల చేయాలని గోగోయ్ డిమాండ్ చేశారు. “ఆరు నెలలుగా ఆ నివేదిక ముఖ్యమంత్రి వద్దే ఉంది. నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే అప్పుడే బయట పెట్టేవారు. మొదటి నుంచే నేను దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పాను. ఇది జాతీయ భద్రత సమస్య అయితే ఆరు నెలలు ఎందుకు మౌనం వహించారు? మా పార్టీ సీఎం కుటుంబం వద్ద 12 వేల బిఘాల భూమి ఉందని బయటపెట్టిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది” అని ప్రశ్నించారు.
READ MORE: The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్ లోపాలు..హీరోయిన్ కి కూడా డూప్ వాడారా?
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల గోగోయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోగోయ్ భార్య ఎలిజబెత్ కొల్బర్న్‌కు పాకిస్థాన్‌కు చెందిన అలీ తౌఖీర్ షేక్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం పాకిస్థాన్‌కు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో గోగోయ్ పాకిస్థాన్ పర్యటన రహస్యంగా జరిగిందని.. అక్కడ ఏదో శిక్షణ తీసుకున్నారనే అనుమానం ఉందని చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలిజబెత్ కొల్బర్న్ పాకిస్థాన్‌లోని LEAD అనే సంస్థలో పనిచేసిందని, ఆ సంస్థను అలీ తౌఖీర్ షేక్ నడిపిస్తారని సీఎం తెలిపారు. భారత్‌కు వచ్చాక కూడా ఆమెకు అక్కడి నుంచే జీతం వచ్చిందని, విదేశీ నిధుల నియమాలను దాటవేశారని ఆరోపించారు. ఆమె భారత్‌లో పనిచేస్తూ సేకరించిన సమాచారాన్ని షేక్‌కు అందించిందని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పాకిస్థాన్ బ్యాంక్ ఖాతాను గోగోయ్ ప్రకటించలేదని విమర్శలు చేశారు. ఈ పరస్పరం ఆరోపణలతో అస్సాం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!