ఈసారి తెలంగాణ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. గెలుపు అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విస్తృత ప్రచారాలు చేస్తున్నాయి. ఇందుకోసం రెండు పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపట్టారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన వికారాబాద్ జిల్లా పరిగి చేరుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ సపోర్టు చేస్తూ రోడ్ షో నిర్వహించారు.
Also Read: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
పరిగి అమరవీరుల చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ రోడ్ షో వేల మందితో భారీ ర్యాలీగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవైసీ యూపీ, హర్యానాలకు వచ్చిచూడూ ఐదు నిమిషాలలో నీ ఇస్సాబ్ పూర్తి చేస్తామన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీని సీఎంని చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్ఐఎం బీఆర్ఎస్ అంతా ఒకటేనని, తెలంగాణలో బీజేపీ ధ్వజమెత్తుతామన్నారు. బీజేపీ సర్కార్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందని, బీసీ సీఎం అవుతాడని పేర్కొన్నారు. కేసీఆర్ ఎస్సీలకు, బీసీలకు ముఖ్యమంత్రి అవకాశాలు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు.
Also Read: Jairam Ramesh: కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడు..
బీజేపీ సంఖ్య ఎక్కువగా ఉందని, అందరికీ న్యాయం చేసే పరిపాలన ఒక్క బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు. హైదరాబాద్‌కు ఏ పార్టీలు వచ్చిన ఓవైసీకి జిందాబాద్ కొడుతున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని, ముస్లింల కొరకు ఐటి పార్క్ చేస్తానని సీఎం కేసీఆర్ అంటున్నాడన్నారు. మొన్న ఓవైసీ హైదరాబాదులో పోలీసులకు దంకీ ఇస్తున్నాడని, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. పరిగిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ కోసం ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండని.. పరిగిని అభివృద్ధి చేసి తీరుతామని హిమంతా బిస్వా పేర్కొన్నారు.