తిరుపతి రూరల్ (మం) ఓటేరులో దారుణం వెలుగుచూసింది. పశువుల చోరీకి పాల్పడ్డారు దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవుల కోసం కారును కొంతదూరం వెంబడించాయి దూడలు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సూర్యకిరణ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గండేపల్లి మండలం తాళ్లూరు, ఉప్పలపాడు గ్రామాల్లో అర్ధరాత్రి గేదెలను దొంగలిస్తుండగా దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. పశువులను ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. దొంగలు హైదరాబాద్, అశ్వరావుపేట కు చెందిన వారిగా గుర్తించారు. దొంగల వద్ద నుంచి ఒక బోలోరే వాహనం ఒక బైక్ మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
