Site icon NTV Telugu

Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తగలబెట్టేశారు..

Software

Software

Software Employee Killed: తిరుపతి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి కారుపై పెట్రోల్ పోసి కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజును దుండగులు తగలబెట్టారు. తిరుపతి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారుకు నిప్పు పెట్టడంతో కాసేపట్లోనే ఆ మంటల్లో నాగరాజు సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకుని కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని పోలీసులు గుర్తించారు.

Read Also: OYO Room : ఓయోలో రూం బుక్ చేశాడు.. రాగానే చంపేశాడు

ఘటనా స్థలంలో లభ్యమైన గోల్డ్ చైన్, చెప్పులు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నాగరాజు మృతితో కుటంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో విచారణ వేగవంతమైంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Exit mobile version