NTV Telugu Site icon

Asna Cyclone: 10 రాష్ట్రాలకు ‘అస్నా’ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలు కూడా

Asna Cyclone

Asna Cyclone

అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అది కాస్తా తుఫాన్‌గా మారింది. 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. మరోవైపు.. ఆంధ్రా తీరప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని.. ఈ అర్ధరాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలను దాటుతుందని భావిస్తున్నారు.

Tragedy: మరో తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం

ఆంధ్రా, తూర్పు తెలంగాణ భారీ వర్షాల హెచ్చరిక
అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతుంది. దీని కారణంగా కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణాలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా.. తెలంగాణ, విదర్భతో పాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. కోస్తాంధ్ర, తెలంగాణాలో ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేశారు. రేపు కూడా విదర్భలో రెడ్ అలర్ట్ అమలులో ఉండనుంది.

ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం..
రేపు అల్పపీడనం ఉత్తరం వైపు పయనిస్తే మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే.. సెప్టెంబర్ 2-3 తేదీలలో పంజాబ్, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే.. అల్ప పీడన ప్రభావంతో ఈరోజు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. రేపు మరుసటి రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అస్నా అరేబియా సముద్రం నుండి వాయువ్య దిశగా కదులుతోంది..
సైక్లోనిక్ తుఫాను అస్నా.. ఈశాన్య అరేబియా సముద్రంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది గంటకు 13-15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. దీని స్థానం క్రమంగా ఉత్తర అరేబియా సముద్రం నుండి వాయువ్య దిశగా కదులుతోంది. అల్పపీడన ప్రాంతం మొత్తం భారత ఉపఖండాన్ని దాటి గుజరాత్‌ను దాటి సముద్రాన్ని చేరుకుని తుఫాన్‌గా మారనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లో ముందే హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెప్పారు. అరేబియా సముద్రంపై ఏర్పడిన ‘అస్నా’ తుపానుగా మారింది. 1976 తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రాన్ని తాకడం ఇదే తొలిసారి. కాగా.. ఈ తుఫాన్ కు పాకిస్తాన్ అస్నా అని పేరు పెట్టింది.