అసిమ్ మునీర్ భారత్ పై విషం కక్కుతూ పహల్గాం ఉగ్ర ఘటనకు కారణమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా ఫీల్డ్ మార్షల్‌గా ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం ఉన్నత స్థాయి విందు ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో వరకు, రాజకీయ, సైన్యం నుంచి అనేక మంది ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. అయితే అసిమ మునీర్ షాబాజ్ షరీఫ్‌కు బహుమతిగా ఇచ్చిన ఫోటోగ్రాఫ్‌పై వివాదం చెలరేగింది.
Also Read:LOVE : డెలివరీ రూమ్ బయట భర్త ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్.. వీడియో చూస్తే మీకూ కంటతడి ఆగదు..!
అసిం మునీర్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు ఒక ఫొటోను బహుకరించారు. ఈ ఫోటోను అతనికి బహుమతిగా ఇచ్చి, అది ఇటీవల భారతదేశంపై పాకిస్తాన్ చేసిన దాడి నాటిదని చెప్పారు. కానీ ఈ ఫోటో నిజానికి 2019 నాటిది. షాబాజ్ షరీఫ్‌కు ఇచ్చిన ఈ ఐదేళ్ల నాటి ఫోటో చైనా సైన్యానికి చెందినది. దీనిని చాలాసార్లు ఉపయోగించారు. కానీ మునీర్ దీనిని ఆపరేషన్ బన్యన్ సమయంలో భారతదేశంపై జరిగిన దాడికి సంబంధించిన చిత్రంగా అభివర్ణించాడు. ఈ వ్యవహారంపై అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ.. వెలుగులోకి కీలక విషయాలు
ఈ ఫోటో ఆగస్టు 18, 2018 నాటిది. చైనీస్ ఆర్మీ PLA 74వ గ్రూప్ కింద PHL-03 లాంగ్-రేంజ్ రాకెట్ సిస్టమ్ ద్వారా అనేక రాకెట్లను ప్రయోగించారు. ఈ రాకెట్లను రాత్రిపూట ప్రయోగించారు. ఈ చిత్రం చైనా సైనిక చర్యకు సంబంధించినది. ఈ ఫోటోను పాక్ పీఎంకు అందించడంతో సొంత పీఎంనే పిచ్చోడిని చేశాడంటూ మునీర్ పై విమర్శలు చేస్తున్నారు.
