Asian Games 2023: భారత్‌కు మరో 3 పతకాలు.. గోల్ఫ్‌లో మొదటి పతకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Wins First Medal in Golf: ఆసియా గేమ్స్ 2023లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో మరో స్వర్ణ పతకం వచ్చింది. ఎనిమిదో రోజైన ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు పసిడిని కైవసం చేసుకుంది. కువైట్, చైనాల నుంచి ఎదురైన పోటీని తట్టుకోగలిగిన భారత్ పోడియంపై అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
పురుషుల ట్రాప్ టీమ్ 361 పాయింట్లు సాధించింది. కువైట్ 352, చైనా 346 పాయింట్లు సాధించాయి. ఇక స్వర్ణ పతకంతో పాటు కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు. అంతకుముందు మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో మనీషా, ప్రీతి, రాజేశ్వరి బృందం రజత పతకం సాధించింది. భారత్ షూటింగ్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు మరియు 5 కాంస్యాలతో మొత్తంగా 21 పతకాలను సాధించింది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
Aslo Read: ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!
మరోవైపు గోల్ఫ్‌లో భారత్‌కు మొదటి పతకం వచ్చింది. హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 మహిళల వ్యక్తిగత విభాగంలో అదితి అశోక్ రజత పతకాన్ని గెలుచుకుంది. దాంతో ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా అదితి నిలిచింది. ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. ఇందులో 11 స్వర్ణ పతకాలు ఉండగా.. 15 రజత, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!