NTV Telugu Site icon

Monkeypox: తీవ్ర రూపం దాల్చిన మంకీపాక్స్.. ఆసియాలోకి ప్రవేశం

Monkeypox In Kerala

Monkeypox In Kerala

ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఆఫ్రికాలోని 12 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. ఆసియాలో కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో.. థాయిలాండ్ ప్రభుత్వం మంకీపాక్స్ కొత్త వేరియంట్ యొక్క మొదటి కేసు తమ దేశంలో సంభవించినట్లు ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్టు 14న ఆఫ్రికా నుంచి థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అతన్ని పరీక్షించగా అతనికి Mpox, క్లాడ్ 1B అనే స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారించబడింది.

ఒక్క కాంగోలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఆసియాలో మొదటి కేసు కాగా.. ఆఫ్రికా ఖండం వెలుపల రెండో కేసు అని థాయ్ ప్రభుత్వం తెలిపింది. అయితే.. మంకీపాక్స్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మంకీపాక్స్ యొక్క కొత్త వేరియంట్ అంటువ్యాధి.. 2022లో కంటే చాలా ప్రాణాంతకం అని డబ్ల్యూహెచ్వో సూచించింది. అయితే.. కాంగోలో మంకీపాక్స్ వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా.. కనీసం 540 మంది మరణించారు.

Italy: విలాసవంతమైన నౌక మునక ఘటనలో మిలియనీర్, అతడి కుమార్తె మృతదేహాలు లభ్యం

మంకీపాక్స్ లక్షణాలు..
మంకీపాక్స్ అనేది మశూచి లాంటి వ్యాధి. ఈ వ్యాధి సోకితే జ్వరం, చలి, శరీరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత శరీరంలో ఎరుపు దద్దుర్లు మొదలవుతాయి. కొద్ది రోజుల్లోనే వాటి నుంచి చీము బయటకు వస్తుంది. ఆఫ్రికాలోని 54 దేశాల్లో 12 దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కాగా.. కాంగోలో ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా CDC) 2024లో మొత్తం 18,910 కేసులలో 94 శాతం లేదా 17,794 ఒక్క కాంగోలోనే నమోదయ్యాయని నివేదించింది. ప్రభుత్వం ప్రకారం.. ఈ సంవత్సరం ఈ వ్యాధి కారణంగా 541 మంది మరణించారు, అందులో 535 మరణాలు కాంగోలోనే సంభవించాయి.

భారత్‌లోనూ అలర్ట్‌
భారత్‌లోనూ మంకీపాక్స్ వ్యాధిపై హెచ్చరిక జారీ చేశారు. మంకీపాక్స్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని విమానాశ్రయాలతో పాటు ల్యాండ్ పోర్ట్‌ల అధికారులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.