NTV Telugu Site icon

Rohit Sharma: సిరాజ్ ఇంకొన్ని ఓవర్లు వేస్తే ఒకటో, రెండో వికెట్లు తీసేవాడు..

Rohit

Rohit

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ దెబ్బకు లంకేయులకు హడల్ పుట్టింది. ఇంకోసారి భారత్ తో మ్యాచ్ అంటే.. భయపడేలాంటి ప్రదర్శన చూపించాడు. నిన్న కొలంబోలో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ లో.. ఇండియా 10 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ భారత్ టైటిల్ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సిరాజ్ 6 వికెట్లు తీయగా.. మరిన్ని వికెట్లు తీసేందుకు అతనికి అవకాశం ఉంది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాటతో అతను బౌలింగ్ చేయలేదు. ఇంతకీ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..

Read Also: Uttar Pradesh: బాలికను వేధించిన ఇన్‌స్పెక్టర్‌.. స్తంభానికి కట్టేసి కొట్టిన స్థానికులు

ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్‌ బౌలింగ్ చేయొద్దని కోచ్ నుంచి సందేశం వచ్చిందని చెప్పాడు. సిరాజ్ 7వ వికెట్ పడగొట్టి ఉంటే.. భారత్ తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టువర్ట్ బిన్నీ రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ఇచ్చిన సందేశంతో సిరాజ్‌ బౌలింగ్ చేయలేదు. సిరాజ్ కు మరిన్ని ఓవర్లు వేసేందుకు బౌలింగ్ ఇవ్వాలనుకున్నట్లు తెలిపాడు. అప్పటికే సిరాజ్.. మంచి ప్రదర్శనతో ఉత్సాహంగా బౌలింగ్ చేస్తున్నాడని.. అదే ఊపులో మరో ఒకటో, రెండో వికెట్లు తీసేవాడన్నాడు. అవకాశం దొరికితే సద్వినియోగం చేసుకోవాలనేది ఏ బౌలరైనా, బ్యాట్స్‌మెన్ అనుకుంటాడని రోహిత్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఆటగాడిపై అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి లేకుండా తాను ప్రతిదీ నియంత్రణలో ఉంచుకోవాలని రోహిత్ చెప్పాడు.

Read Also: Union Cabinet: సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం!

ఇంతకుముందు త్రివేంద్రంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టిన సంఘటనను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉందని తనకు గుర్తుందని తెలిపాడు. 8-9 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడని.. కానీ 7 ఓవర్లలోనే 6 వికెట్లు తీయడం గొప్ప అని రోహిత్ శర్మ అన్నాడు.