R Ashwin Slams BCCI Over Yashasvi Jaiswal Excluded: ఆసియా కప్ 2025 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో చోటు ఆశించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు నిరాశే ఎదురైంది. స్టాండ్‌బైలో అతడికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. జైస్వాల్‌కు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న అతడికి ఆసియా కప్‌లో చోటు దక్కలేదు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. 165 స్ట్రైక్‌రేట్ ఉన్నా జైస్వాల్‌కు భారత జట్టులో చోటు లేకపోవడం సరికాదని బీసీసీఐపై అసహనం వ్యక్తం చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘యశస్వి జైస్వాల్‌కు టెస్ట్ క్రికెట్‌లో అవకాశం వచ్చింది. అతడు దానిని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాట్స్‌మన్ యశస్వి మాత్రమే. అవకాశం ఇచ్చినపుడు ఏ ఫార్మాట్‌లోనైనా రాణించాడు. అవకాశం వచ్చినపుడు రాణించడం తప్ప మరేం చేయగలరు?. యశస్వి రాణించినా ఇప్పుడు ఛాన్స్ రాలేదు. నాయకత్వం రేసులోనూ నిలిచిన యశస్వి.. ఇప్పుడు జట్టులోనే లేకపోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. టీ20 ఫార్మాట్‌లో అతడి స్ట్రైక్‌రేట్ 165. జట్టు కోసం ఆడే వారు చాలా తక్కువ. యశస్వి ఆలాంటి ఆటగాడి. అతడు జట్టులో ఉండాల్సింది’ అని బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: Dhanashree Verma: ఆరోజు బాగా ఏడ్చేశా.. విడాకులపై మొదటిసారి మాట్లాడిన ధనశ్రీ!
భారత జట్టు:
సూర్యకుమార్, గిల్, అభిషేక్, హార్దిక్, అక్షర్, బుమ్రా, జితేశ్ శర్మ, శివమ్ దూబె, అర్ష్‌దీప్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్.
స్టాండ్‌బైలు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
