Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్‌లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌పై సాధించిన ఘన విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, పాక్ మ్యాచ్‌ను ఇకపై ‘పోటీ’ అని పిలవద్దని అంటూ వ్యాఖ్యానించాడు. దీనితో ఈ మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. విలేకర్ల సమావేశంలో భాగంగా ఓ సీనియర్ పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ సమాధానమిస్తూ.. భారత్-పాక్ మధ్య ఉన్న ‘పోటీ’ గురించి మాట్లాడటం ఆపేయాలని కోరాడు. సర్, ఇకపై మీరు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ‘పోటీ’ అని పిలవడం మానేయాలని నా అభ్యర్థన అంటూ నవ్వుతూ అన్నాడు.
Abhishek Sharma: తగ్గేదేలే.. అలా చేస్తే అసలు నచ్చదు.. అందుకే ఇచ్చి పడేశా!
ఇక ఇరు జట్ల మధ్య ఉన్న గణాంకాలను ప్రస్తావిస్తూ.. రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగితే స్కోరు 8-7 ఉంటే అది పోటీ. కానీ ఇక్కడ 12-3 లేదా 13-1 ఉంది. ఇది ఏ విధంగానూ పోటీ కాదని ఘాటుగా బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సూర్యకుమార్ నవ్వుతూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయాడు. ఇంకా ఈ సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఏ జట్టు అయినా నాణ్యమైన క్రికెట్ ఆడుతుందా లేదా అనేదే నాకు ముఖ్యం. మేము పాకిస్తాన్ కంటే మెరుగైన క్రికెట్ ఆడాం, ముఖ్యంగా బౌలింగ్ పరంగా కూడా అని అన్నాడు. అభిమానులను అలరించడానికే తాము వచ్చామని, తమ ఆటతోనే వారిని ఆకట్టుకుంటామని తెలిపాడు. అంతేకాకుండా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. 7 నుంచి 15 ఓవర్ల మధ్య ఏ జట్టు బాగా ఆడుతుందో ఆ జట్టే గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.
Haris Rauf: ఛీ.. ఛీ.. మొత్తానికి పాకిస్థానీ బుద్ధి బయటపెట్టావ్ కదరా.. వీడియో వైరల్
అలాగే టీంఇండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ (74), శుభ్‌మన్ గిల్ (47) ల ప్రదర్శనపై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు. ఇక ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అభిషేక్ గురించి మాట్లాడుతూ, అతనికి ఏం చేయాలో తెలుసు, బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో అర్థం చేసుకోగలడు. అది అతనికి ఉన్న ప్లస్ పాయింట్. ప్రతి మ్యాచ్‌లోనూ అతను ఎంతో నేర్చుకుంటున్నాడని అన్నాడు. ఇక సూపర్ ఫోర్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ ఆడనున్నాయి.
Suryakumar Yadav says there's no rivalry between India and Pakistan anymore in terms of cricket. pic.twitter.com/EAB0gMJeGA
— Inside out (@INSIDDE_OUT) September 21, 2025
