Site icon NTV Telugu

Asia Cup 2025: రషీద్ ఖాన్ కెప్టెన్‌గా ఆసియా కప్‌ బరిలోకి ఆఫ్ఘనిస్తాన్.. జట్టు ప్రకటన!

Asia Cup 2025: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. స్పిన్‌ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ లతోపాటు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌ వరకు చేరి జట్టు చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే సిరీస్‌లో ఆడిన జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. హజ్రతుల్లా జజై, జుబైద్ అకబరీలను జట్టు నుంచి తప్పించగా.. రహమానుల్లా గుర్బాజ్, మహమ్మద్ ఇషాక్ ఇద్దరూ వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు.

జట్టులో పేస్‌ బౌలింగ్ కోసం నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ, ఫరీద్ మాలిక్‌లను ఎంపిక చేశారు. బ్యాటింగ్ విభాగంలో ఇబ్రాహీం జాద్రాన్, దర్వీష్ రసూలీ, సెడికుల్లా అతాల్, అజ్మతుల్లా ఒమర్జై, కరీమ్ జనత్, గుల్బదిన్ నయిబ్, షరఫుద్దీన్ అష్రఫ్ ఉన్నారు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంకలతో కలిసి గ్రూప్ Bలో ఉంది. ఇక భారత్, ఒమాన్, పాకిస్తాన్, యుఎఈలు గ్రూప్ Aలో పోటీపడనున్నాయి. రషీద్ సేన తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 9న హాంకాంగ్‌తో ఆడనుంది.

Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు!

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రాహీం జాద్రాన్, దర్వీష్ రసూలీ, సెడికుల్లా అతాల్, అజ్మతుల్లా ఒమర్జై, కరీమ్ జనత్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్, షరఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్.

రిజర్వ్ ప్లేయర్లు: వాఫియుల్లా తరఖిల్, నంగేయాలియా ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్.

Realme New Phone: రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320W ఫాస్ట్ ఛార్జింగ్!

Exit mobile version