2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నఖ్వీ తన హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లాడు. నఖ్వీ ప్రవర్తనపై విస్తృత విమర్శలు వచ్చాయి. తాజాగా మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి ట్రోఫీని అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆయన ఒక షరతు విధించారని క్రిక్‌బజ్ నివేదించింది. భారత జట్టు ఆటగాళ్లకు తానే స్వయంగా ట్రోఫీ, పతకాలను అందజేస్తానని చెప్పారు. ఇందుకోసం అధికారికంగా వేడుకను సైతం నిర్వహించాలని తెలిపాడు. భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాల దృష్ట్యా, అటువంటి ఏర్పాటు చేయడం అసంభవం.
READ MORE: Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?
కాగా.. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే ఆటగాళ్లు డగౌట్‌కు చేరుకున్నారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో గందరగోళం నెలకొంది. ఇక, ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ. 21కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
