Site icon NTV Telugu

Gautam Gambhir: ఆ ‘షేక్ హ్యాండ్’ ఏదో ఇచ్చేయండి.. వారి గోల ఉండదు.. కోచ్ గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అంటే ఎన్నో అంచనాలు, ఉద్వేగాలు. అయితే, ఆసియా కప్ 2025లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లు కేవలం ఆటపరంగానే కాకుండా.. మైదానం వెలుపల జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో, చివరికి అంపైర్లతో కూడా కరచాలనం చేయలేదు. ఈ చర్య పెద్ద వివాదానికి దారితీసింది.

Surya Kumar Yadav: ఇకనైనా ఆపండి.. భారత్‌కు పాక్ పోటీ కానే కాదు.. రిపోర్టర్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా కెప్టెన్!

అయితే, సూపర్-4 మ్యాచ్‌లో ఈ పరిస్థితిలో స్వల్ప మార్పు కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అంపైర్లతో మాత్రమే కరచాలనం చేయమని సూచించారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉండగా మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సూర్యకుమార్, ఇకపై భారత్-పాక్ మ్యాచ్‌ను ‘పోటీ’ అని పిలవడం మానేయాలని కోరాడు. ఇందులో భాగంగా రెండు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరిగితే స్కోర్ 8-7 ఉంటే అది పోటీ. కానీ 10-1 లేదా 13-0 వంటి గణాంకాలు ఉంటే అది పోటీ కాదు. ఇది మంచి క్రికెట్ ఆడుతున్న ఒక జట్టు, అంతగా రాణించని మరో జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్ మాత్రమే” అని వ్యాఖ్యానించాడు.

Abhishek Sharma: తగ్గేదేలే.. అలా చేస్తే అసలు నచ్చదు.. అందుకే ఇచ్చి పడేశా!

Exit mobile version