Anurag Thakur: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్‌ను బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ క్రీడా మంత్రి స్పందించారు. క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్లలో ఇటువంటి మ్యాచ్‌లను ఆపలేమని మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
READ MORE: Maoist Sujathakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క.. 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు..
జాతీయ మీడియా సంస్థలు అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి ఠాకూర్ సమాధానమిచ్చారు. “ఏసీసీ లేదా ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా నిర్వహించే మ్యాచ్‌లను అన్ని దేశాలు తప్పనిసరి ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడకపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. లేదా మ్యాచ్‌ను కోల్పోవలసి వస్తుంది. కోల్పోతే ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు వెళ్తాయి. అందుకే ఈ మ్యాచ్ ఇరు దేశాలు ఆడటం తప్పనిసరి. కానీ భారత్ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపివేసేయ వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు నిలివేస్తూ నిర్ణయం తీసుకున్నాం.” అని స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: నేపాల్ ప్రధాని సుశీల కార్కికి మోడీ అభినందనలు, ఆ దేశ ప్రజలకు సందేశం..
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ మ్యాచ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడొద్దనే డిమాండ్లు వినిపించాయి. అదేవిధంగా ఆ దేశంతో వాణిజ్యం చేయొద్దని చెబుతున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో దాయాది జట్టుతో మేం మ్యాచ్ ఆడలేదు. వ్యక్తిగతంగా పాకిస్థాన్‌తో క్రికెట్‌కు, వాణిజ్యానికి నేను మద్దతు ఇవ్వను. ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ వైఖరిని గౌరవిస్తాను. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు క్రికెట్, వ్యాపారం ఉండకూడదని భావిస్తున్నాను. ఏదేమైనా.. తుది నిర్ణయం ప్రభుత్వానిదే. కానీ.. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలి’’ అని పేర్కొన్నాడు.
