ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ జాకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్‌కు బదులు జకీర్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ మ్యాచ్ కోసం బంగ్లా తుది జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు చెప్పాడు. మరోవైపు భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ మరో మ్యాచ్ గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్ చేరుతుంది. మరోవైపు సూపర్ 4 తొలి గేమ్‌లో శ్రీలంకను మట్టికరిపించిన బంగ్లా.. ఆ ప్రదర్శనను టీమిండియాపై పునరావృతం చేయాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే బంగ్లా కూడా ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించడం బంగ్లాకు అంత ఈజీ కాదు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, సమీమ్ హుస్సేన్, జకీర్ అలీ (కీపర్, కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ షాకిబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్.
