Site icon NTV Telugu

Asia Cup 2025: పట్టించుకోని ఐసీసీ.. తోకముడిచిన పాకిస్థాన్‌ బోర్డు!

Pcb Pakistan

Pcb Pakistan

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌ తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయన్ను టోర్నీ నుంచి తొలగించాలని ఆసియా క్రికెట్‌ సంఘం (ఏసీసీ)కి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది.

Also Read: Kribhco Chairman: ‘క్రిబ్కో’ ఛైర్మన్‌గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి!

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ రిఫరీని తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను సోమవారం ఐసీసీ తిరస్కరించింది. పీసీబీ చేసిన ఫిర్యాదును ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలకు అంగీకరించలేదు. పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. అయితే ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలుగుతామని పీసీబీ అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే.. బుధవారం పాకిస్థాన్‌, యూఏఈ మ్యాచ్‌ జరగన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే పాక్‌ సూపర్‌ 4కు అర్హత సాధిస్తుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ పాక్ సూపర్‌ 4కు చేరుకుంటే.. సెప్టెంబర్‌ 21న మరోసారి భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

Exit mobile version