NTV Telugu Site icon

Ashokgajapathi Raju: భావితరాలకు భారంగా అప్పులు

Ashok1

Ashok1

ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా అప్పులు పడే విదంగా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శించారు మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు.

కర్ఫ్యూకి కారకులైన నాయకులు మాకు నేర్పిస్తారా…మమ్మల్ని భయపెడతారా? మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్లారు. కానీ ఏ రోజు భయపడలేదు. అన్నగారి పౌరుషంతో బ్రతికారు. అలానే మనం కూడా బ్రతకాలి. స్థానిక ఎమ్మెల్యే మూర్ఖత్వంతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు ఒక వారధి లాంటివారు. తెల్ల దొరలు భయపెట్టినట్టు ప్రతీ విషయంలో వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు.

ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండని హెచ్చరిస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. చేసిన పనిలో పెద్దరికం ఉంటుంది. కావున మన ధర్మం ఏంటనేది మనం ఆలోచించుకుని పని చేయాలి. జైల్లో ఉండవలిసిన వాడు బెయిలుపై వచ్చి మన భవిష్యత్ ను, మన పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో గమ్మత్తైన పరిస్థితులను చూస్తున్నాం.

ఎంతో మంది ప్రముఖల స్ఫూర్తితో 40 ఏళ్ల కిందట తెలుగు వాళ్ల కోసం టీడీపీని స్థాపించారు. దేశంలో రాజకీయాల్లో ప్రభావాన్ని తీసుకు వచ్చిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరి కంటే తక్కువ కాదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్లాఘించారు. ఒట్టి మాటలు కట్టిపెట్టు..గట్టి మేలు తలపెట్టవోయ్ .అంటూ గురజాడ మాటలను గుర్తు చేస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేస్తే టీడీపీ కి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.

Sri Lanka: అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన గోటబయ రాజపక్సే.