NTV Telugu Site icon

Rajastan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నామినేషన్‌ దాఖలుకు గెహ్లాట్ దూరం

Rajasthan Political Crisis

Rajasthan Political Crisis

Rajastan Political Crisis: తన సొంత గడ్డపై సమస్య తలెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి. అశోక్ గెహ్లాట్ శిబిరానికి చెందిన 80 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పించారు. జులై 2020లో గ‌తంలో పార్టీపై తిరుగుబాటు చేసిన స‌చిన్ పైల‌ట్‌కు రాజ‌స్థాన్‌ సీఎం ప‌ద‌విని అప్పగిస్తే ఊరుకునేది లేద‌ని తెగేసి చెబుతున్నారు. మరోవైపు రాజస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌ల వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు.

Ghulam Nabi Azad: పార్టీ పేరు, జెండాను ప్రకటించిన గులాం నబీ ఆజాద్‌.. పేరేంటో తెలుసా?

ఇక 2020 జులైలో తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసిన స‌చిన్ పైల‌ట్ సోనియా, రాహుల్ గాంధీలు జోక్యం చేసుకుని గెహ్లాట్‌ వ‌ర్గంపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా రాహుల్ గాంధీ రాజస్థాన్‌కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అశోక్ గెహ్లాట్‌ను కేసీ వేణుగోపాల్‌ను వివరణ కోరారు. ఆదివారం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మూడు పాయింట్ల ఎజెండాను ముందుకు తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో గెహ్లాట్ విధేయుల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవాలని డిమాండ్ కూడా ఉంది. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాజస్థాన్‌లో నాయకత్వ మార్పుపై చర్చలు జరగాలని గెహ్లాట్ క్యాంపు ఎమ్మెల్యేలు మాకెన్, ఖర్గేతో సహా పార్టీ హైకమాండ్ దూతలకు తెలియజేసారు. మూడోది అశోక్ గెహ్లాట్ ఎంపికను పరిగణనలోకి తీసుకోవాలి.