Site icon NTV Telugu

Ashok Gehlot: ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో బీజేపీ విఫలమైంది..

Ashok Gehlot

Ashok Gehlot

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వారం రోజులు అవుతున్న కూడా ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకోలేకపోతుందని మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఒక వేళ కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఉంటే ముఖ్యమంత్రిని డిసైడ్‌ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

కాగా, కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్‌ఐకు ఎన్‌ఓసీ ఇచ్చే ఫైల్‌పై తాను సంతకం చేయలేదని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచి వారం రోజులు అయినా కూడా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, కొత్త సీఎం ఎన్‌ఐఏ ఫైల్‌పై సంతకం చేయాల్సి ఉంది.. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి అని బీజేపీ అధిష్టానికి గెహ్లాట్‌ కోరారు.

Read Also: Sai Pallavi: రెండేళ్ల తర్వాత కనిపించినా లేడీ పవర్ స్టార్ క్రేజ్ తగ్గలేదు…

ఇక, కమలం పార్టీలో క్రమశిక్షణ లేదు అని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఎన్నికలు జరిగి వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సీఎంను ఎంపిక చేయలేదు అంటూ ఆయన మండిపడ్డారు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై బీజేపీ వాళ్లు ఎన్ని విమర్శలు చేసేవాళ్లో అని ఆయన విమర్శలు గుప్పించారు. తాజా, ఎన్నికల్లో కమలం పార్టీ ఓట్లు పోలరైజ్‌ చేసి గెలిచారు.. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం అందిస్తామని అశోక్ గెహ్లాట్‌ తెలిపారు.

Exit mobile version