అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూడో చిత్రం వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు డైరెక్షన్ లో తెరక్కెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్.. వాట్ ఎ ట్రాన్ఫర్మేషన్
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రస్తుతం మార్చి 19, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఒకవేళ ఏదైనా కారణం వల్ల ‘టాక్సిక్’ సినిమా ఆ తేదీకి వాయిదా పడితే ఆ డేట్‌లో న అశోక్ గల్లా ‘వీసా’ను విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ధురంధర్ 2’ మార్చి 19న వస్తోంది. దానికిపోటీగా టాక్సిక్ వస్తోంది. ఒకవేళ టాక్సిక్ రాకుంటే ఎట్టి పరిస్థితుల్లో వీసా = డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల జీవితాలు, వారి ప్రేమలు, స్నేహాలు మరియు కెరీర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో అశోక్ గల్లా సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాహుల్ విజయ్ మరియు శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘టాక్సిక్’ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న మేకర్స్, ఫిబ్రవరి చివరి నాటికి ‘వీసా’ విడుదల తేదీపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
