Site icon NTV Telugu

Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్‌గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: విజయనగరం కోటలో నూతనంగా నిర్మించిన మోతీమహల్‌ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే లిటరసీ ఎక్కువగా ఉన్న గోవాకు గవర్నర్‌గా వెళ్లడం తన అదృష్టం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసిందని విమర్శించారు. లక్షా 60 వేల హెక్టార్లలో అడవిని నరికేసిందని అన్నారు. ప్రజలకు ప్రాథమిక విద్య, ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని అన్నారు. గత ప్రభుత్వం తనను ఎంతో అవమానించిందని, బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేసిందని చెప్పారు. మాన్సాస్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు అడిగినందుకు తన మీద కేసులు పెట్టించిందని అన్నారు.

READ ALSO: BRS Suspends MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ.. కేసీఆర్ సంచలన నిర్ణయం..

రూ.12 కోట్లతో ఆధునికీకరించిన మోతీ మహల్‌లో మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఆర్ కళాశాలను కొనసాగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ మోతీ మహల్ తరగతి గదుల్లో దాదాపు 2వేల మంది విద్యార్థులకు బోధించేలా ఏర్పాట్లు చేశారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

READ ALSO: MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్‌ఎస్‌ కూలింది

Exit mobile version