Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Dinda: మాజీ భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశోక్ డిండా (Ashok Dinda) రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ డిండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మోయ్నా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్‌పై 16,241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో కూడా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంగ్రామ్ డోలూయిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ డిండా.. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. భారత తరఫున 13 వన్డేలు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన వన్డేల్లో 12 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టారు. దేశీయ క్రికెట్లో బెంగాల్ జట్టుకు కీలక ఆటగాడిగా సేవలందించిన డిండా, ఐపీఎల్లో కూడా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఐపీఎల్లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు సాధించారు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2021 ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన అశోక్ డిండా.. తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కించుకోవడంతో క్రికెట్ మైదానంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
🚨 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 : Joyel Murmu, Ashok Dinda, Anandamoy Burman, Santanu Pramanik, Purnima Chakraborty and Umesh Rai sworn in as ministers in West Bengal.#BreakingNews #WestBengal pic.twitter.com/mVaPiSrcpC
— VARTA ( वार्ता ) (@varta24news) June 1, 2026
తాజావార్తలు
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!