టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా అద్భుతంగా సక్సెస్ అయ్యారు. దిల్ రాజు సక్సెస్ లో తన సోదరుడు నిర్మాత శిరీష్ కూడా ఒక భాగమని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.ఆశిష్ హీరో గా నటించిన మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. తన మొదటి సినిమాతోనే ఆశిష్ అనుపమ పరమేశ్వరన్ తో లిప్ లాక్, రొమాన్స్ సీన్స్ తో రెచ్చిపోయి నటించాడు.. ప్రస్తుతం ఆశిష్ హీరో గా సెల్ఫిష్ అనే టైటిల్ తో తన రెండవ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఆశిష్ సరసన లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు..
ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు హోమ్ బ్యానర్ అయిన శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఇటీవలనే షూటింగ్ కూడా కంప్లిట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా పక్క యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు సమాచారం.. తాజాగా ఆశిష్ మూడో సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.ఆశిష్ కోసం ఈ సారి మరింత గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు మరియు అల్లుడు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.స్టార్ కెమెరామెన్ అయిన PC శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల వర్క్ చేస్తున్నారు. తాజాగా ఆశిష్ మూడో సినిమా పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆశిష్ పై ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాని అరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
https://twitter.com/DilRajuProdctns/status/1693499424822231432?s=20