NTV Telugu Site icon

Owaisi: బీజేపీ ముస్లింలకు శత్రువు..దానికి ఈ బిల్లు నిదర్శనం..ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi

వక్ఫ్ బోర్డు బిల్లుపై చర్చలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలకు బీజేపీ శత్రువు అన్నారు. ఈ బిల్లు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని, ఇది పౌరులందరికీ వారి విశ్వాసాన్ని ఆచరించడానికి సమాన అవకాశాన్ని కల్పిస్తుందని ఒవైసీ అన్నారు. “ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆలయ కమిటీల్లో హిందువేతరులు ఉన్నారా? అలాంటప్పుడు వక్ఫ్ ఆస్తిలో దాని అవసరం ఏమిటి? క్రైస్తవులు, సిక్కుల విషయంలో కూడా మీ ప్రభుత్వం అదే చేస్తోంది.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Ponnam Prabhakar: రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం..

అంతే కాదు యూపీలోని సహరాన్‌పూర్ లోక్‌సభ స్థానానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం.. వక్ఫ్ బోర్డు ఒక సంస్థ.. అది మతపరమైన స్థలం కాదని ప్రభుత్వం వాదిస్తోందన్నారు. ఇది తప్పు ఎందుకంటే వక్ఫ్ బోర్డు దేశవ్యాప్తంగా మసీదులు, దర్గాలు, ఇతర ముస్లిం సంస్థలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. తమ ఆస్తులను తాము చూసుకుంటాన్నామని.. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ముస్లింల మతపరమైన వ్యవహారాల నుంచి వక్ఫ్ బోర్డును వేరు చేయలేమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Show comments