మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్ సభలో అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. భారత దేశంలో బతకాలంటే మోడీకి ఓటేయాల్సిందేనని చెప్పినందుకు కొద్ది రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ ముస్లింలను రైలులో ఎక్కించి చంపేశాడని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also: Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్
నేడు దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై హోంమంత్రి మాట్లాడారని, అస్సాం రైఫిల్స్‌పై ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఆయుధాలు దోచుకుంటున్నారు.. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఓవైసీ ప్రశ్నించారు.
Read Also: PM Kisan Tractor Yojana: కేంద్రం అద్భుత స్కీం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు..!
హిజాబ్‌పై వివాదం సృష్టిస్తున్నారని, ముస్లిం బాలికలను చదువుకోనివ్వడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిల్కిస్ బానో ఈ దేశపు కూతురో కాదో మోడీ ప్రభుత్వం చెప్పాలి, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో దోషులను ఎందుకు విడుదల చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చైనా సరిహద్దు దాట్టుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఎంఐఎం ఎంపీ ప్రశ్నించారు. చైనా మన భూమిపై కూర్చోలేదా? సమస్య దేశంలో ఉంది, సరిహద్దులో కాదు. కులభూషణ్ జాదవ్‌ని ఎందుకు వెనక్కి తీసుకురాలేదని ఆయన అడిగారు.
Read Also: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్.. భారీగా పెరిగిన ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్స్
ప్రధాని మోడీ కేవలం జిన్‌పింగ్‌ని విమర్శించారు.. కానీ చైనా మన గడ్డపై కూర్చుంటే.. మనం సైన్యాన్ని ఎందుకు అక్కడ నుంచి ఉపసంహరించుకుంటున్నాము అని ఓవైసీ అడిగారు. రాజ్యాంగంలో మనస్సాక్షి స్వేచ్ఛ ప్రస్తావన ఉంది.. కానీ, మోడీ ప్రభుత్వం యూసీసీ తీసుకురావడానికి మొండిగా వ్యవహరిస్తుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రధాని మోడీకి ముస్లింలపై చాలా ప్రేమ ఉంది.. కానీ ఆయన మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు అని ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.