Asaduddin Owaisi: ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు, పార్లమెంటరీ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలోని బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నట్టు గుర్తించగలగినప్పుడు.. పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎలా కనుగొనలేకపోయారని ప్రశ్నించారు.
Work From Home: తండ్రి మరణం.. ఉద్యోగి బాధను లైట్ తీసుకున్న కంపెనీ.. చివరకు..?
బీహార్ లో విదేశీయులను గుర్తించగలుగుతారు.. కానీ, పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు అనే దానిపై మాత్రం విచారణ ఉండదు. మీరు నిద్రపోతున్నారా..? మీ పరిపాలన కళ్లు మూసుకుని కూర్చున్నదా..? అని ఒవైసీ ప్రశ్నించారు. పహల్గాం దాడిపై దేశవ్యాప్తంగా జరిగిన “ఆపరేషన్ సిందూర్” లో భాగంగా.. ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా ఉన్న ఒవైసీ, ఈ ఆపరేషన్‌ను నిలిపివేయకూడదని.. నలుగురు ఉగ్రవాదుల్ని గుర్తించే వరకూ ఆపరేషన్ కొనసాగాలని కోరారు. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకూ తాను ఇలాంటి కఠిన ప్రశ్నలు అడగడం మానని హెచ్చరించారు.
ఇంకా ఒవైసీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై కూడా విమర్శలు గుప్పించారు. జూలైలో మీరు మీ తప్పును ఒప్పుకుంటున్నారు. ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెబుతున్నారని మాకు తెలుసు. కానీ, దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నారని చెప్పినట్టే సరిపోదు.. చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో 26 మంది హిందూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఒవైసీ తీవ్రంగా తీసుకున్నారు. ఈ దాడిపై సమగ్ర విచారణ, దోషుల పట్ల కఠిన చర్యలు, భద్రతా లోపాలపై స్పష్టమైన సమాధానాలు ప్రభుత్వంతో అడుగుతానని స్పష్టం చేశారు.
