NTV Telugu Site icon

Asaduddin Owaisi: సీఎం కేసీఆర్ను తక్కువ అంచనా వేయద్దు.. ఆయన ముందు ఎవ్వరూ నిలవలేరు

Asad

Asad

సీఎం కేసీఆర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశచరిత్రలో తొలిసారి సచివాలయంలో సీఎం కేసీఆర్‌ మసీద్‌, మందిర్‌, చర్చిని నిర్మించారని తెలిపారు. సచివాలయంలో మసీద్‌, మందిర్‌, చర్చి అద్భుతంగా కట్టారని కొనియాడారు. అంతేకాకుండా.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని అసదుద్దీన్ పేర్కొ్న్నారు. ఈసారి తమ సీట్లు కూడా పెంచబోతున్నామన్నారు.

Telangana: హృదయవిధారక ఘటన.. తల్లీ బ్రతికించాలని వేడుకున్న కొడుకు..

మరోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రానున్నారని అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సింగిల్ డిజిట్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో బీజేపీకి బలం లేదని అన్నారు. ఈసారి తమ పార్టీ స్థానాలు పెంచుకుంటామని పేర్కొన్నారు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదని.. అతని రాజకీయ చతురత ముందు ఎవ్వరూ నిలవలేరని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని అభ్యర్థికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని అసద్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయన్నారు. దేశంలో కూడా తెలంగాణలాంటి విజన్‌ కావాలని.. దేశంలో మూడో ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న చోట తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా మసీద్‌ కూల్చితే మళ్లీ కట్టారా..? అని ప్రశ్నించిన ఓవైసీ.. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో మైనార్టీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు.

Abhishek Agarwal: దేశ ప్రజలకు, కశ్మీర్‌ పండిట్లందరికీ రెండు జాతీయ అవార్డులు అంకితం!

ఉదయం తెలంగాణ సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళి సైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మసీదు ప్రారంభంతో పాటు ప్రార్ధనల్లో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు పాల్గొన్నారు.