Site icon NTV Telugu

Asaduddin Owaisi: భారత్లో పేదలు, ముస్లీంలు లేకుండా చేయాలని చూస్తున్నారు..

Assadudhin

Assadudhin

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA)పై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. సీఏఏను ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీల‌తో క‌లిపి చూడాల‌ని అప్పుడే దాన్ని స‌రిగ్గా అర్ధం చేసుకోగ‌ల‌మ‌న్నారు. లోక్‌స‌భ‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్.. సీఏఏపై కేంద్రం తీరు ఏంటో స్పష్టంగా తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఈ దేశంలో పేద‌లు, ద‌ళితులు, మైనారిటీలు, ముస్లింల‌కు చోటు లేకుండా చేయ‌డ‌మే సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీ లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.

Read Also: Bangalore: మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

ఇక, పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ సీఏఏ నిబంధనలను గత ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని క్వశ్చన్ చేశారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో మోడీ సర్కార్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ తెచ్చారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

Exit mobile version