Asaduddin Owaisi : పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ అమాయకులను హతమార్చారని, ఇవి పూర్తిగా మతతత్వ ప్రేరేపిత హత్యలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే ఈ దాడికి కారణమని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు నల్లరిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని ఒవైసీ పిలుపునిచ్చారు. దాడికి వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని ఎంఐఎం కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
CM Yogi: ఉగ్రదాడి బాధితుల మాటలు విని కన్నీరుపెట్టుకున్న సీఎం యోగి.. (వీడియో)
