NTV Telugu Site icon

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోకు ముహూర్తం ఖరారు.. షేర్ ధర ఎంతో తెలుసా?

Lic Ipo

Lic Ipo

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్‌ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఐపీవో ఆధారంగా ఎల్‌ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది.

అటు ఎల్‌ఐసీ ఐపీవోలో పెట్టుబడి పెట్టే రిటైల్ పెట్టుబడిదారులకు తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. ఐపీవోలో పెట్టుబడి పెట్టే పాలసీదారులకు 10శాతం వరకు తగ్గింపు ఉంటుందని సమాచారం. అలాగే ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.940గా ఉంటుందని అంచనా. ముందుగా మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుగా ప్రణాళిక వేసింది. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతంలో ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన 5 శాతం వాటాను విక్రయిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది 3.5 శాతం మాత్రమే అని తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ బాగుంటే ప్రభుత్వం తన వాటా విక్రయాన్ని 5 శాతానికి పెంచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Twitter: ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ కొనసాగుతారా?

Show comments