MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలోనే ఆప్, బీజేపీల మధ్య ప్రారంభ పోకడలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ముందస్తు విజయాన్ని అంచనా వేయడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. ఉదయం 10.40 గంటల వరకు బీజేపీ 119, ఆమ్ ఆద్మీ పార్టీ 118, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. విజయం ఎవరిదో తేలాలంటే చివరి వరకు ఉత్కంఠ తప్పదని పలువురు నేతలు చెబుతున్నారు.
Delhi Civic Polls Results: ఢిల్లీ కార్పొరేషన్ ఫలితాలు నేడే.. బీజేపీ, ఆప్‌లలో తీవ్ర ఉత్కంఠ
దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఆప్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ పాలించింది. ఢిల్లీ వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్‍ఆద్మీ పార్టీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టు సాధించలేదు. 2017 ఎన్నికల్లో 270 వార్డులు ఉండగా బీజేపీ 181 సీట్లు గెలిచింది. ఆమ్‍ఆద్మీ 48 చోట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 30 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఆమ్‍ఆద్మీ పార్టీకి తొలిసారి దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి.